ys jagan: వైఎస్ జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జీవీఎల్

  • సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన జీవీఎల్
  • జగన్ ను అభినందించి దుశ్శాలువాతో సత్కారం
  • ఉదయం జగన్ ని కలిసిన నిఖిల్ గౌడ
ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా జగన్ ని దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తనను కలిసి అభినందించిన జీవీఎల్ కు జగన్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఈరోజు ఉదయం జగన్ ని కలిసి అభినందించారు.
ys jagan
cm
bjp
gvl
tadepalli
guntur

More Telugu News