Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు ఆధ్వర్యంలో వేలాది కోట్ల ఖనిజ సంపద దోచుకున్నారు: పెద్దిరెడ్డి

  • ఇసుక అక్రమాలు జరిగిన చోట్ల ఓడిపోయారు
  • ఉచిత ఇసుక విధానంతో బాగా లాభపడ్డారు
  • 25 శాతం ఆదాయం ఖనిజాల నుంచి వచ్చేలా కొత్త పాలసీ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో వేలాది కోట్ల ఖనిజ సంపద దోచుకున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇసుక అక్రమాలు జరిగిన చోట్లంతా టీడీపీ ఓడిపోయిందని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఉచిత ఇసుక విధానంతో ప్రభుత్వానికి నష్టం వస్తే టీడీపీ నేతలు మాత్రం బాగా లాభపడ్డారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

15 రోజుల్లో కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామని, ప్రభుత్వ ఆదాయంలో 25 శాతం ఆదాయం ఖనిజాల నుంచి వచ్చేలా కొత్త పాలసీ రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలన్నారు. అక్రమ తరలింపుల విషయంలో జిల్లా అధికారులే బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్య తీసుకుంటామన్నారు.
Peddireddy Ramachandra Reddy
Telugudesam
Chandrababu
Sand
District Officers

More Telugu News