Andhra Pradesh: జగన్.. మీకు నా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది!: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్

  • వైఎస్సాఆర్ రైతు భరోసా పథకంపై ప్రశంసలు
  • ఇది రైతుల్లో మనోధైర్యం నింపిందని వ్యాఖ్య
  • ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమలు

రైతులను ఆదుకునేందుకు వీలుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సాఆర్ రైతు భరోసా’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకంతో పాటు ఏపీ సీఎం జగన్ పై ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న రైతుల్లో ఈ పథకం మనోధైర్యం నింపిందని కొనియాడారు.

తాను దివంగత నేత వైఎస్ తో కలిసి రైతుల కోసం చాలాసార్లు పనిచేశానని పేర్కొన్నారు. 'మీ నాయకత్వంలో రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలకు నా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’ అని సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఎంఎస్‌ స్వామినాథన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సాఆర్ రైతు భరోసా పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు కలిపి రైతులకు ఏటా రూ.12,500 అందజేస్తారు. 

More Telugu News