amaravathi: అమరావతిలో జరుగుతున్న పనులపై సీఎం వద్ద సమీక్షిస్తాం: మంత్రి బొత్స

  • సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన బొత్స 
  • రాజధానిలో పనులపై  అధికారులతో సమీక్ష
  • పనుల పురోగతి, ఇతర అంశాలను వివరించిన అధికారులు
ఏపీ రాజధానిలో పనులపై సీఎం జగన్ వద్ద సమీక్షిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఆర్డీఏ కార్యాలయానికి బొత్స ఈరోజు వెళ్లారు. అమరావతిలో జరగుతున్న పనులపై ఏడీసీ, సీఆర్డీఏ అధికారులతో బొత్స సమీక్షించారు. పనుల పురోగతి, ఇతర అంశాలను అధికారులు వివరించారు. అనంతరం మీడియాతో బొత్స మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షిస్తోందని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.
amaravathi
cm
jagan
crda
botsa

More Telugu News