Rajinikanth: రజనీకాంత్, కమలహాసన్ పై కట్టప్ప వ్యంగ్యాస్త్రాలు

  • స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరంలేదు
  • కొత్తగా పార్టీ పెట్టినవారు విఫలం అయ్యారు
  • రాజకీయ శూన్యతలేదని తమిళ ఓటర్లు నిరూపించారు
రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరిస్తున్న రజనీకాంత్, పార్టీ పెట్టినా తనదైన ముద్రవేయలేకపోతున్న కమలహాసన్ లపై దక్షిణాది నటుడు సత్యరాజ్ విమర్శలు చేశారు. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందంటూ రజనీ చేయకచేయక ఓ వ్యాఖ్య చేస్తే దానిపై సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని ఓటర్లు నిరూపించారని బదులిచ్చారు.

స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరంలేదని నిర్మొహమాటంగా చెప్పారు. రజనీకాంత్ స్థానికతను దృష్టిలో పెట్టుకుని సత్యరాజ్ ఈ కామెంట్ చేసినట్టు అర్థమవుతోంది. తమిళనాడులో ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న రజనీకాంత్ జన్మతః మరాఠీ వ్యక్తి అని తెలిసిందే. మరోవైపు, కమలహాసన్ పైనా కట్టప్ప తనదైన శైలిలో వ్యంగ్యం ప్రదర్శించారు. కొత్తగా పార్టీ పెట్టినవారు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని, ఎన్నికల్లో విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు.
Rajinikanth
Kamal Haasan
Sathyaraj

More Telugu News