gopichand: నిర్మాతకి టెన్షన్ పెడుతోన్న గోపీచంద్ 'చాణక్య'

  • గోపీచంద్ హీరోగా 'చాణక్య'
  • 50 శాతం చిత్రీకరణ పూర్తి
  • సక్సెస్ కోసం గోపీచంద్ వెయిటింగ్
గోపీచంద్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు 'తిరు' ఒక సినిమా రూపొందిస్తున్నాడు. కథాకథనాల పరంగా ఇటీవలే ఈ సినిమాకి 'చాణక్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ జరుపుకుంది.

అయితే ఈ సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ ఎప్పుడో దాటిపోయిందట. మధ్యలో ఉండగానే ఈ సినిమా బడ్జెట్ ఈ స్థాయిలో పెరిగిపోవడం నిర్మాతను టెన్షన్ పెడుతోందట. గోపీచంద్ ను సక్సెస్ పలకరించి చాలాకాలమే అయింది. అందువలన 'చాణక్య' ఆయనకి సక్సెస్ ను ఇవ్వవలసిన అవసరం వుంది. అదే సమయంలో అనిల్ సుంకరకి లాభాలు తెచ్చిపెట్టవలసి వుంది. బడ్జెట్ పెరుగుతుండటమంటే లాభాల శాతం తగ్గుతుండటమే కనుక, అనిల్ సుంకర టెన్షన్ పడుతున్నారని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.
gopichand

More Telugu News