Undavalli: ఉండవల్లి ప్రజావేదికపై వైసీపీ లేఖ ఇవ్వలేదు: తలశిల రఘురామ్

  • నా పేరిట సోషల్ మీడియాలో వార్తలు
  • అన్నీ అవాస్తవమేనన్న తలశిల
  • ప్రజావేదిక తమకు ఇవ్వాలంటున్న టీడీపీ

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికకు సంబంధించి తన పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వ్యాఖ్యానించారు. ప్రజావేదికను వైసీపీకి కేటాయించాలని పార్టీ తరఫునగానీ, తానుగానీ ఎటువంటి లేఖలు ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశానని ఆయన చెప్పారు. ఈ విషయంలో మీడియాలో ఇంకా వార్తలు వస్తున్నందునే మరోసారి స్పందిస్తున్నానని ఆయన అన్నారు. కాగా, కృష్ణా నది కరకట్టపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో ప్రజావేదిక ఉందన్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాల కోసం ఈ ప్రజావేదికను తమకే అప్పగించాలని టీడీపీ కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News