Puduchcherry: పుదుచ్చేరి మాజీ సీఎం జానకిరామన్‌ మృతి

  • అనారోగ్య కారణాలతో కన్నుమూత
  • ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన జానకిరామన్
  • సంతాపం వెలిబుచ్చిన డీఎంకే నేతలు

డీఎంకే సీనియర్ నేత, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఆర్వీ జానకిరామన్‌ (78) అనారోగ్య కారణాలతో మృతిచెందారు. గత కొంత కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ ఉదయం మరణించారని జానకి రామన్ కుటుంబీకులు తెలిపారు. ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన, 1996 నుంచి 2000 వరకూ ముఖ్యమంత్రిగా, ఆపై 2006 వరకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. పుదుచ్చేరి డీఎంకే కన్వీనర్‌ గానూ పని చేశారు. 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రామన్‌ మృతిపట్ల డీఎంకే నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News