Kathua: కతువా బాలికపై అత్యాచారం, హత్య కేసులో తీర్పు నేడే.. భద్రత కట్టుదిట్టం

  • గతేడాది జనవరి 10న అపహరణకు గురైన 8 ఏళ్ల బాలిక
  • నాలుగు రోజుల తర్వాత బాలిక మృతదేహం లభ్యం
  • మొత్తం 8 మందిపై అభియోగాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా అత్యాచారం, హత్యకేసులో నేడు ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఈ నెల 3నే విచారణ పూర్తి కాగా, నేడు జిల్లా సెషన్స్ జడ్జ్ తేజ్‌విందర్ సింగ్ తీర్పు చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో కథువాతోపాటు కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కోర్టుకు సమర్పించిన 15 పేజీల చార్జిషీట్ ప్రకారం.. గతేడాది జనవరి 10న జమ్ముకశ్మీర్‌లోని కతువాకు చెందిన 8 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. ఆపై చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేశారు. నాలుగు రోజుల తర్వాత బాలిక మృతదేహం లభ్యమైంది.

ఈ కేసులో గ్రామ పెద్ద సంజీ రామ్, ఆయన కుమారుడు విశాల్, బాలుడైన ఆయన మేనల్లుడు, అతడి స్నేహితుడైన అనంద్ దత్తా, ఇద్దరు స్పెషల్ పోలీసులు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలకమైన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు కీలక నిందితుడైన సంజీరామ్ నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకున్న హెడ్‌కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఎస్ఐ ఆనంద్ దత్తాలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

మొత్తం 8 మంది నిందితుల్లో ఏడుగురిపై అత్యాచారం, హత్య అభియోగాలు నమోదయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడిపై విచారణ మొదలుకావాల్సి ఉంది.

More Telugu News