Anil Agarwal: ఆధార్ కార్డుంటే రూ. 2 లక్షల రుణమివ్వండి: ప్రధానికి వేదాంత అధినేత అనిల్ అగర్వాల్ సూచన!

  • ప్రజల సగం ఆదాయం దిగుమతులపై ఖర్చు
  • రుణమిస్తే, ప్రభుత్వ రంగ సంస్థల్లో అభివృద్ధి వేగం
  • స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరిన అనిల్ అగర్వాల్

ప్రభుత్వ రంగ సంస్థలు మూడు రెట్లు గొప్పగా పని చేయాలంటే, దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ముద్రా యోజన కింద రూ. 2 లక్షల చొప్పున రుణం ఇవ్వాలని  వేదాంత లిమిటెడ్‌ అధినేత అనిల్‌ అగర్వాల్‌ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సూచించారు. దేశంలో దాగి ఉన్న అపారమైన ఖనిజ వనరులను వెలికి తీసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ప్రభుత్వరంగ బ్యాంకులు, సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన కోరారు. అలా చేస్తే, దేశంలో పేదరికాన్ని తరిమికొట్టవచ్చని, కొత్త ఉద్యోగాల సృష్టి కూడా సులువవుతుందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ వ్యాఖ్యానించారు.

 ప్రస్తుత ఇండియా పరిస్థితిని 'మదర్‌ ఇండియా' సినిమాతో పోల్చిన ఆయన, రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణమిచ్చిన వారు పట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. ఇక్కడి ప్రజలు తమ సగం ఆదాయాన్ని దిగుమతులపై ఖర్చుచేస్తున్నారని, ఆపై వడ్డీలకు చెల్లింపులు పోగా ఏమీ మిగలడం లేదని అభిప్రాయపడ్డారు. సహజ వనరులు, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున సృష్టించవచ్చని అన్నారు.

More Telugu News