TV9: రవిప్రకాశ్ బయట ఒకలా, విచారణలో మరొకలా వ్యవహరిస్తున్నారు: ఏసీపీ శ్రీనివాస్

  • రవిప్రకాశ్ విచారణకు సహకరించలేదు
  • ఫోర్జరీకి పాల్పడినట్టు ఆధారాలున్నాయి
  • సాక్ష్యులను బెదిరించినట్టుగా గుర్తించాం

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీ కేసులో దర్యాప్తు జరుపుతున్న సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రవిప్రకాశ్ బయట ఒకలా, విచారణలో మరోలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయితే, రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని వెల్లడించారు. రవిప్రకాశ్ సాక్ష్యులను బెదిరించినట్టుగా కూడా తమ విచారణలో గుర్తించామని చెప్పారు. ఫోర్జరీ కేసుకు సంబంధించి కొందరు వ్యక్తుల నుంచి కీలక సమాచారం, ఆధారాలు సేకరించామని ఏసీపీ శ్రీనివాస్ వివరించారు.

అలంద మీడియా చేసిన ఫిర్యాదు ఆధారంగా అన్నిరకాలుగా రవిప్రకాశ్ ను విచారించినట్టు తెలిపారు. కానీ, రవిప్రకాశ్ విచారణలో తమకు సహకరించలేదని, కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపెట్టలేదని పేర్కొన్నారు. రవిప్రకాశ్ చెప్పిన సమాధానాలను, తమ వద్ద ఉన్న ఆధారాలను రేపు న్యాయస్థానంలో సమర్పిస్తామని, కోర్టు ఉత్తర్వుల ఆధారంగా రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలో వద్దో నిర్ణయించుకుంటామని ఏసీపీ వెల్లడించారు. విచారణకు ముందే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని చెప్పారు.

More Telugu News