MLC jeevan reddy: జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణకు అవమానం : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • స్పీకర్‌ను మూడో వరుసలో కూర్చోబెట్టారు
  • దీనిపై ప్రోటోకాల్‌ అధికారులు వివరణ ఇవ్వాలి
  • పక్క రాష్ట్రం నేత స్టాలిన్‌కు ఉన్న గౌరవం దక్కలేదు

ఏపీలో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు వారం రోజులు దాటిపోయిన తర్వాత అప్పుడు జరిగిన ఓ అంశంపై జీవన్‌రెడ్డి ఇప్పుడు విమర్శలు చేస్తూ సంచలనానికి తెరతీశారు. జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పక్క రాష్ట్రంలోని ఓ పార్టీ నాయకునికి లభించిన గౌరవం తెలంగాణ అసెంబ్లీ సభాపతికి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అసలు పిలవని పేరంటానికి వెళ్లి స్పీకర్‌ రాష్ట్రం పరువు తీశారని ధ్వజమెత్తారు.

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని మూడో వరుసలో ఎందుకు కూర్చోబెట్టారో ప్రోటోకాల్‌ అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంత అవమానం ఎదురయ్యాక స్పీకర్‌కు తన పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌కి శాసన వ్యవస్థ అంటే ఏమిటో తెలియదన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ బరితెగించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మిత్రపక్షమేనని, ప్రతిపక్షం కాదన్నారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంది ఇచ్చిపుచ్చుకునే ధోరణి అని విమర్శించారు.

More Telugu News