Vijay Sai Reddy: కోడెల కుటుంబ సభ్యులెవరూ తప్పించుకోలేరు: విజయసాయిరెడ్డి

  • 'కే ట్యాక్స్' పేరిట డబ్బు వసూలు
  • వందల కోట్లు దోచుకున్నారు
  • సహకరించిన అధికారులూ దోషులేనన్న విజయసాయి
ప్రజలను బెదిరించి 'కే ట్యాక్స్' పేరిట డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరకూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ పెట్టారు. "ప్రజలు, వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కోడెల కుటుంబ సభ్యులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. ‘కే’ ట్యాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారు. దీనికి సహకరించిన అధికారులు కూడా దోషులే. నిర్బంధ వసూళ్ల మాఫియా అరాచకాలపై దర్యాప్తు జరుగుతుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి" అని ఆయన కోరారు.

అంతకుముందు "ఎన్నికల్లో ఎలాగోలా గెలవాలని 99%  రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో అలవికాని హామీలను గుప్పిస్తాయి. చంద్రబాబులాంటి వారు గెలిచాక మేనిఫెస్టోను మాయం చేయడం కూడా చూశాం. జగన్ గారు మాత్రం దాన్నో పవిత్ర గ్రంథంలా భావిస్తున్నారు. నవరత్నాల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి" అని అన్నారు.
Vijay Sai Reddy
Kodela
Family
K Tax

More Telugu News