Rahul Gandhi: తనను తొలిసారి ఎత్తుకున్న రాజమ్మ... 48 ఏళ్ల తరువాత ఆమె ఇంటికి రాహుల్ గాంధీ!

  • 1970, జూన్ 19న జన్మించిన రాహుల్
  • నాడు సోనియాకు పురుడు పోసిన బృందంలో రాజమ్మ
  • ఇంటికి వెళ్లి పలకరించిన రాహుల్ గాంధీ
దాదాపు 48 సంవత్సరాల క్రితం... ఇంకా సరిగ్గా చెప్పాలంటే, 1970, జూన్ 19. అప్పట్లో 23 సంవత్సరాల వయసులో ఉన్న రాజమ్మ అనే యువతి, నర్సింగ్ లో డిగ్రీ చదివి, ఆపై హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తుండగా, సోనియా గాంధీకి డెలివరీ చేసిన లేబర్ రూమ్ బృందంలో ఆమె కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ జన్మించిన వేళ, తొలిసారిగా ఎత్తుకున్నది ఆమె. నర్సుగా రిటైర్ అయిన తరువాత భర్తతో కలిసి కేరళలోని వయనాడ్ లో ఆమె నివశిస్తున్నారు.

ఇక తనను గెలిపించిన వయనాడ్ లో ప్రస్తుతం పర్యటిస్తున్న రాహుల్, రాజమ్మ ఇంటికి వెళ్లారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాజమ్మ మీడియా ముందుకు వచ్చి, రాహుల్ ఢిల్లీలోనే పుట్టాడని, అందుకు తానే సాక్ష్యమని వెల్లడించిన సంగతి తెలిసిందే.
Rahul Gandhi
Vayanad
Rajamma
Nurse

More Telugu News