Tapsee: హీరోయిన్ తాప్సీకి తీవ్రగాయాలు... నిజమా? సినిమా ప్రమోషనా?!

  • ఎర్రగా కందిపోయిన ఎడమ చెయ్యి
  • రెండు కాళ్లకూ పిండికట్లు
  • ఏం జరిగిందో చెప్పాలంటున్న ఫ్యాన్స్

ప్రముఖ హీరోయిన్ తాప్సి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె చేతికి తీవ్ర గాయమైనట్టు, రెండు కాళ్లకూ పిండి కట్టు కట్టుకున్నట్టుగా ఈ ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆమె ఎడమ చేయ్యంతా ఎర్రగా కందిపోయి ఉంది. ప్రస్తుతం తాను నటించిన 'గేమ్‌ ఓవర్‌' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆమె, అందులో భాగంగానే ఈ ఫోటోలను విడుదల చేసిందా? లేక నిజంగానే ప్రమాదం జరిగి గాయపడిందా? అన్న విషయమై స్పష్టత లేదు. ఇక ఈ ఫొటోకు క్యాప్షన్ గా "మంచు కొండల్లో షిఫాన్‌ చీరలు కట్టుకుని ఇరవై ఐదు రోజుల పాటు చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను" అని తాప్సీ పేర్కొంది. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు అసలేం జరిగిందో చెప్పాలని కోరుతున్నారు.

More Telugu News