indian railway: ఇకపై రైళ్లలో మసాజ్.. టికెట్ విలువ రూ. 100

  • రైళ్లలో ఫుట్, హెడ్ మసాజ్
  • ఆదాయాన్ని పెంచుకునే పనిలో భారతీయ రైల్వే
  • తొలి విడతగా ఇండోర్ నుంచి ప్రయాణించే రైళ్లలో సేవలు

మరింత ఆదాయాన్ని పొందేందుకు భారతీయ రైల్వే సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా రైళ్లలో మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా ఇండోర్ నుంచి ప్రయాణించే 39 రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా ఫుట్ మసాజ్, హెడ్ మసాజ్ సేవలను ప్రయాణికులు పొందవచ్చు.

ఈ సందర్భంగా రైల్వే బోర్టు మీడియా డైరెక్టర్ రాజేశ్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, రైల్వే చరిత్రలో ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తుండటం ఇదే తొలిసారని అన్నారు. ఈ సేవలతో ప్రయాణికులు సేద తీరుతారని చెప్పారు. దీని వల్ల రైల్వే శాఖకు అదనంగా ఏడాదికి రూ. 20 లక్షల ఆదాయం సమకూరుతుందని... రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుందని... ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల రైల్వేకు అదనంగా ఏడాదికి మరో రూ. 90 లక్షల ఆదాయం లభిస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News