kotak mahindra bank: కొటక్ మహీంద్రా బ్యాంకుకు భారీ పెనాల్టీ విధించిన ఆర్బీఐ

  • ప్రమోటర్ల వాటాల విలీనం విషయంలో నిబంధనల ఉల్లంఘన 
  • బ్యాంకు సమాధానాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం 
  • రూ. 2 కోట్ల పెనాల్టీ విధింపు 
ప్రమోటర్ల వాటాలకు సంబంధించి సరైన సమాచారం అందించలేదనే కారణంగా కొటక్ మహీంద్రా బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. రూ. 2 కోట్ల పెనాల్టీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రమోటర్ల వాటాల విలీనం విషయంలో తమ నిబంధనలను, సూచనలను పాటించలేదని ఈ సందర్భంగా ఆర్బీఐ తెలిపింది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ విధిస్తున్నట్టు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసును జారీ చేశామని... బ్యాంకు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా విధించాలని నిర్ణయించామని తెలిపింది.
kotak mahindra bank
rbi
penalty

More Telugu News