Andhra Pradesh: సముద్రాలను రక్షించుకుంటామని ప్రతీఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి!: సుజనా చౌదరి

  • విషపూరిత వ్యర్థాలు, ప్లాస్టిక్ ప్రమాదకరంగా మారింది
  • ఎకోఫ్రెండ్లీ పద్ధతుల్ని మనం పాటించాలి
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

విషపూరితమైన వ్యర్థాలు, ప్లాస్టిక్ కారణంగా నేడు మన సముద్రాలు తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి తెలిపారు. ఈరోజు ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల ద్వారా మన భూమికి ప్రాణాధారమైన సముద్రాలను రక్షించుకుంటామని ప్రతీఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు సుజనా చౌదరి ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు. ప్రతీఏటా జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) 2008లో నిర్ణయించింది. ఆహార భద్రత, ఆరోగ్యం, అన్నింటికి సముద్రాలు చాలాకీలకం. అందుకే సముద్ర ప్రాముఖ్యతను తెలిపేందుకు ఏటా జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

More Telugu News