Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్ వరాల జల్లు!

  • 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని ప్రకటించిన సీఎం
  • పీఎస్ రద్దుపై తుదినిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • రేపు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే సీపీఎస్ రద్దు విషయంలో రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు.

ఈరోజు సచివాలయం ఉద్యోగులతో గ్రీవెన్స్ హాల్ లో సమావేశమైన జగన్ ఈ మేరకు ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలంటే అందరు ఉద్యోగుల సహకారం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. అందరూ కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగ సంఘాలతో పాటు చాలామంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News