Andhra Pradesh: 'తుడా' చైర్మన్ గా ఎమ్మెల్యే చెవిరెడ్డికి కీలక పదవి అప్పగించిన ముఖ్యమంత్రి!

  • మొదటి నుంచీ జగన్ ని వెన్నంటి ఉన్న చెవిరెడ్డి 
  • ఇప్పటికే ప్రభుత్వ విప్ గా నియామకం 
  • చంద్రగిరి ఎమ్మెల్యేగా రెండోసారి విజయం
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే ఏపీ ప్రభుత్వ విప్ గా నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను మరో కీలక పదవి వరించింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ నియమించారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి చెవిరెడ్డి జగన్ వెన్నంటే నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు.  
Andhra Pradesh
YSRCP
chandragiri
Jagan
chevireddy

More Telugu News