హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ

  • నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ
  • నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తి
  • వికలాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక క్యూ లైన్లు
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు, రేపు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వికలాంగులు, వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ విషయమై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పలు సూచనలు చేశారు.
Go Back to Shorts
Hyderabad
nampaly
exhibition grounds

More Telugu News