vishwak sen: కావాలనే నా సినిమా గురించి చెడుగా చెప్పారు: హీరో విష్వక్సేన్

  • నా సినిమాపై చెడుగా ప్రచారం చేశారు
  • నా సినిమా పోస్టర్స్ చింపేశారు
  • పథకం ప్రకారమే ఇవన్నీ చేశారు

దర్శకుడిగా .. కథానాయకుడిగా 'ఫలక్ నుమా దాస్' తో విష్వక్సేన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో వుంది. ఈ సినిమా విడుదలైన తరువాత కొందరు పోస్టర్స్ చింపడం .. ఆ విషయంపై విష్వక్ సీరియస్ కావడం జరిగాయి. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

"సాధారణంగా తొలి రోజున సినిమా చూసి థియేటర్స్ లో నుంచి వచ్చేవారు, మీడియా వారికి తమ అభిప్రాయం చెప్పేసి వెళ్లిపోతుంటారు. అయితే ఈ విషయంలో కొన్ని బ్యాచులు రంగంలోకి దిగి, నా సినిమా బాగోలేదని చెప్పాయి. పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ప్రకారం .. కావాలనే వాళ్లు అలా చేశారు. ఆ తరువాత నా సినిమా పోస్టర్స్ చింపేశారు. అందుకనే నాకు అంత కోపం వచ్చింది. నా సినిమా బాగుంది కాబట్టేగదా ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News