relangi narasimha rao: చంద్రమోహన్ గురించి ఆ ఒక్క విషయమే చెప్పుకునేవారు: రేలంగి నరసింహారావు

  • చంద్రమోహన్ తో 24 సినిమాలు చేశాను 
  • ఆయనకి కాస్త జిహ్వ చాపల్యం ఎక్కువ
  • అంకితభావం కలిగిన నటుడు
తెలుగు తెరపై హాస్య ప్రధానమైన కథలను పరిగెత్తించిన దర్శకులలో రేలంగి నరసింహారావు ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " నా తొలి సినిమా హీరో చంద్రమోహన్. ఆయనతో నేను 24 సినిమాలు చేశాను. చంద్రమోహన్ తో చేయమని నా నిర్మాతలు వచ్చేవారు. నేను కూడా అలా ఆయనతో చేస్తూ వెళ్లాను.

నాటి నుంచి నేటి వరకూ చంద్రమోహన్ తో నాకు మంచి స్నేహం వుంది. అప్పట్లో ఆయన చాలా తిండి ప్రియుడు .. ఒక సమయమనేది లేకుండా తినేస్తూ ఉంటారని అనేవారు. ఆయనకి కాస్త జిహ్వ చాపల్యం ఎక్కువ .. అంతే. అయితే మరే విషయంలోను ఆయనపై ఎలాంటి రిమార్క్ లేదు. ఇచ్చిన డేట్స్ ప్రకారం వచ్చేవారు .. చెప్పిన సమయం ప్రకారం చేసేవారు. చాలా అంకితభావంతో .. కష్టపడి పనిచేసేవారు.అందువల్లనే ఆయన అంతటి నటుడయ్యారు" అని చెప్పుకొచ్చారు. 
relangi narasimha rao

More Telugu News