'శివ' సినిమా నుంచి ఇప్పటివరకూ వర్మ ఏమీ మారలేదు: నటుడు ఉత్తేజ్

07-06-2019 Fri 14:37
  • 'శివ'తో వర్మతో పరిచయం
  • ఆయనతో ఎంతో సాన్నిహిత్యం వుంది 
  • వర్మ మారిపోయే మనిషి కాదు  
తాజా ఇంటర్వ్యూలో నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావించాడు. 'శివ' సినిమా సమయంలో రచయిత నడిమింటి నరసింగరావు ద్వారా వర్మతో నా పరిచయం జరిగింది. అప్పటి నుంచి వర్మతో నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని.

వర్మ గురించి తెలియనివాళ్లు .. ఆయన అలా మాట్లాడతాడేంటి? అప్పుడు గొప్ప సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తాడేంటి? ఆయన యాటిట్యూడ్ ఒక పట్టాన అర్థం కాదు"అని అనుకుంటూ వుంటారు. కానీ వర్మ ఇప్పుడు కొత్తగా మారిందేమీ లేదు. ఆయన ఇప్పుడు ఎలా వున్నారో .. 'శివ' సినిమా సమయంలోను అలాగే వున్నారు. సక్సెస్ వచ్చేసిందనీ .. డబ్బు వచ్చేసిందని చెప్పేసి మారిపోయే మనిషి కాదు ఆయన" అంటూ చెప్పుకొచ్చాడు.