J.D.Chakravarthi: అప్పుడలా, ఇప్పుడిలా... జగన్‌లో చాలా మార్పు వచ్చింది: హీరో జె.డి.చక్రవర్తి

  • పదేళ్ల క్రితం విమానంలో పక్కనే కూర్చున్నా పలకరించలేదు
  • గత ఏడాది  కనిపిస్తే ఎలా ఉన్నారని అడిగారు
  • ఆయన మార్పునకు ఇదే నిదర్శనం
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై సినీ హీరో జె.డి.చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో జగన్‌లో చాలా మార్పువచ్చిందని, ఇప్పుడు ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారని చెప్పారు. ఆయన కీలకపాత్రలో నటించిన ’హిప్పీ’ చిత్రం గురువారం విడుదలైన  సందర్భంగా ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ సందర్భంగా సదరు ప్రతినిధి ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌పై మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నించగా గత అనుభవాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.

 ‘2008లో ఓసారి విమాన ప్రయాణంలో జగన్‌ది నా పక్కసీటే. అప్పటికి నాకు యాక్సిడెంట్‌ అయి నడవలేని స్థితిలో  ఉన్నాను. సీటు సౌకర్యంగా లేదని వీల్‌చైర్‌ అడిగా. ఆ సందర్భంగా నన్ను జగన్‌ గమనించినా కనీసం ఎలా వున్నారని కూడా అడగక పోవడంతో ఆశ్చర్యపోయాను. అదే జగన్‌ గత ఏడాది విమానాశ్రయంలో కనిపించినప్పుడు ‘ఎలా ఉన్నారు?’ అంటూ కుశల ప్రశ్నలు వేసి అదే స్థాయిలో ఆశ్చర్యపరిచారు. ఇది ఆయనలో వచ్చిన మార్పుగా నేను భావిస్తున్నా' అని చక్రవర్తి వివరించారు.
J.D.Chakravarthi
Y.S.Jaganmohanreddy
interview

More Telugu News