allu arjun: మొత్తానికి బన్నీ మూవీలో ఛాన్స్ పట్టేశాడు

  • హీరోగా రాణించలేకపోయిన సుశాంత్ 
  • ముఖ్యమైన పాత్రల వైపు మొగ్గు
  •  త్రివిక్రమ్ మూవీలో అవకాశం

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన సుశాంత్, ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. చూడటానికి కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నప్పటికీ, సక్సెస్ రూపంలో కాలం కలిసి రాలేదు. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంతమంది హీరోల మాదిరిగానే ముఖ్యమైన పాత్రలను చేయడానికి సిద్ధమైపోయాడు.

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సుశాంత్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని సుశాంత్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. రీసెంట్ గా మొదలైన సెకండ్ షెడ్యూల్ షూటింగులో సుశాంత్ కూడా జాయిన్ అయ్యాడు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందనీ, టబు .. పూజా హెగ్డే లతో కలిసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనేది మాత్రం కుర్రాడు సస్పెన్స్ లో పెట్టేశాడు. 

More Telugu News