Azim Premji: విప్రో నుంచి విరామం.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి అజీం ప్రేమ్‌జీ గుడ్‌బై

  • వచ్చే నెల 30న రిటైర్ కాబోతున్న ప్రేమ్‌జీ
  • ఆయన స్థానంలో కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ నియామకం
  •  నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా కొనసాగనున్న ప్రేమ్‌జీ
విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ (74) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల 30న ప్రేమ్‌జీ రిటైర్ కాబోతున్నారని అయితే,  నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా ఆయన కొనసాగుతారని విప్రో పేర్కొంది. ప్రస్తుతం చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా, బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రానున్నట్టు తెలిపింది.  
Azim Premji
Wipro
Rishad

More Telugu News