Amit Shah: అమిత్ షాకు వాజ్ పేయి నివసించిన ఇల్లు!

  • కృష్ణమీనన్ మార్గ్ లోని 6-ఏలో నివాసం ఉన్న వాజ్ పేయి
  • తుదిశ్వాస విడిచేవరకూ అక్కడే
  • అదే ఇల్లు ఇప్పుడు అమిత్ షా కు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి నివసించిన ఇంటిని కేటాయించారు. కృష్ణమీనన్ మార్గ్ లోని 6-ఎ ఇంట్లో వాజ్‌ పేయి తన తుదిశ్వాస విడిచే వరకు ఉన్నారు. గత సంవత్సరం ఆగస్టులో ఆయన మరణించారు. ఇప్పుడా ఇంటిని అమిత్ షాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం అక్బర్ రోడ్ లోని 11వ నంబర్ ఇంట్లో ఉన్న షా, త్వరలోనే కొత్త ఇంటికి మారనున్నారని తెలుస్తోంది. కాగా, రెండోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రివర్గంలోకి అమిత్ షాను తీసుకోవడంతో పాటు అత్యంత కీలకమైన హోమ్ శాఖను అప్పగించారు.
Amit Shah
BJP
New Delhi
Home
Vajpaye

More Telugu News