Kaira Advani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమిళ చిత్రంలో కైరా అద్వానీ
  • మరో చిత్రంలో అల్లరి  నరేశ్ 
  • కాకినాడలో వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' 

*  తెలుగు, హిందీ భాషల్లో బిజీగా వున్న కథానాయిక కైరా అద్వానీ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. శివకార్తికేయన్ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయిక పాత్రకు కైరాను ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి.
*  ఇటీవల వచ్చిన 'మహర్షి' చిత్రంలో మహేశ్ కి స్నేహితుడుగా ఓ కేరక్టర్ చేసిన హీరో అల్లరి నరేశ్ త్వరలో మరో చిత్రంలో కూడా ఓ కేరక్టర్ పోషించనున్నాడు. రవితేజ హీరోగా రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడానికి నరేశ్ ఓకే చెప్పాడట.
*  సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసరాల్లో జరుగుతోంది. సుకుమార్ వద్ద పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

More Telugu News