Jagan: జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

  • లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా నాకు అవకాశమిచ్చారు
  • చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది
  • ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతిని బయట పెడతాం
తనపై నమ్మకంతో లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా తనకు జగన్ అవకాశమిచ్చారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయట పెడతామని, ఇందుకు సంబంధించి జ్యుడిషియల్ కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి మాట్లాడుతూ, ‘హోదా’ కోసం గట్టిగా కృషి చేస్తామని, కేంద్రం, తెలంగాణతో స్నేహ పూర్వక వైఖరి అవలంబిస్తామని స్పష్టం చేశారు.
Jagan
YSRCP
mp
mithun reddy
Telugudesam

More Telugu News