Dorasani: రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా 'దొరసాని'... టీజర్ విడుదల!

  • హీరోగా పరిచయం అవుతున్న ఆనంద్ దేవరకొండ
  • ఈ ఉదయం టీజర్ విడుదల
  • అలరిస్తున్న డైలాగులు
ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక తెరంగేట్రం చేస్తున్న 'దొరసాని' టీజర్ ఈ ఉదయం విడుదలై, వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దొరల గడీల నేపథ్యంలో సాగుతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. "వీనికేం తెల్వదు పీకదు... దొరసానులెప్పుడైనా బయటకు వత్తార్రా?", "నేను చిన్న దొరసాన్ని ప్రేమిస్తానురా... అంటే దొరసాని కూడా నన్ను చూత్తాంది", "మీరు దొరసాని... కాదు దేవకి... కాదు మీరు నా దొరసాని" అనే డైలాగులు అలరిస్తున్నాయి. చిత్రం టీజర్ ను మీరూ చూడండి.
Dorasani
Shivatmika
Anand Devarakonda
Teaser

More Telugu News