Kesineni Nani: కేశినేని నానితో ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు

  • ఈ ఉదయం నుంచి కేశినేని వ్యవహారం చర్చనీయాంశం
  • పార్టీ విప్ పదవి వద్దన్న నాని
  • తనవద్దకు పిలిపించుకున్న చంద్రబాబు
విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం టీడీపీలో తీవ్ర కలకలం రేపింది. లోక్ సభలో పార్టీ విప్ గా వ్యవహరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని నాని తిరస్కరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో ఆయన పార్టీ మారతారంటూ ఊహాగానాలు బయల్దేరాయి. ఈ నేపథ్యంలో, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మధ్యవర్తిత్వానికి ప్రయత్నించారు. కేశినేని నానితో మాట్లాడి చంద్రబాబుతో చర్చలకు ఒప్పించారు.

ఈ క్రమంలో చంద్రబాబు తన నివాసానికి నాని, జయదేవ్ లను పిలిపించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వారితో చంద్రబాబు భేటీ ముగిసింది. సమావేశంలో భాగంగా కేశినేని నానితో చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. నాని మనసులో మాటను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో కలిసికట్టుగా పోరాడాల్సి ఉందని, అందుకోసం అందరూ సహకరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Kesineni Nani
Chandrababu
Telugudesam

More Telugu News