Telangana: కేసీఆర్ తెలంగాణను బెంగాల్ లా మార్చేస్తున్నారు.. ఓ బీజేపీ కార్యకర్తను చంపేశారు!: బీజేపీ నేత రాజా సింగ్

  • మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ గూండాలు దాడిచేశారు
  • విజయ ఉత్సవ్ ర్యాలీని అడ్డుకున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన గోషామహల్ ఎమ్మెల్యే
పరిషత్ ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని పశ్చిమబెంగాల్ లా మార్చేస్తున్నారని బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. మహబూబ్ నగర్ లో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన విజయ ఉత్సవ్ ర్యాలీపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్(23) అనే బీజేపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణలో బీజేపీ శరవేగంగా బలపడటాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాజాసింగ్ ట్విట్టర్ లో స్పందించారు.
Telangana
KCR
mahabubnagar
Chief Minister
BJP
raja singh

More Telugu News