Uttar Pradesh: మరుగుదొడ్డి టైల్స్‌పై జాతిపిత బొమ్మలు.. అధికారిపై వేటు!

  • గోడకు గాంధీ, అశోక్‌చక్ర ఉన్న టైల్స్‌ అంటింపు
  • గమనించి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు
  • సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు 

నిర్లక్ష్యమో...అత్యుత్సాహమో...తెలియక చేసిన తప్పో...కారణం ఏదైనా ఓ అధికారి చేసిన తప్పిదం గ్రామస్థులకు ఆగ్రహం తెప్పించింది. జాతిపిత మహాత్మాగాంధీ ఫొటోలు ఉన్న టైల్స్‌ను స్వచ్ఛ అభియాన్‌ పథకం కింద నిర్మించిన మరుగు దొడ్లకు అంటించడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారిపై సస్పెన్షన్‌ వేటుపడింది.

  ఉత్తరప్రదేశ్‌లోని బులందసహార్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. బులంద్ షహర్‌లోని దీబాయ్‌ తహసీల్‌లోని ఇచ్చవరి గ్రామంలో స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కింద దాదాపు 508 మరుగుదొడ్లు నిర్మించారు. వీటిలో 13 మరుగుదొడ్లకు మహాత్మాగాంధీ, అశోక్‌ చక్ర చిత్రాలున్న టైల్స్‌ వినియోగించారు. దీన్ని గమనించిన గ్రామస్థులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధికారులు సీరియస్‌ అయి సదరు అధికారిని సస్పెండ్‌ చేశారు. వారం రోజుల క్రితమే మరుగుదొడ్లకు ఈ టైల్స్‌ అంటించినట్లు సమాచారం.

More Telugu News