karthyikeya: 'హిప్పీ'లో జేడీ చక్రవర్తి పాత్ర హైలైట్ గా నిలుస్తుందట

  • రేపు థియేటర్లకు రానున్న 'హిప్పీ'
  • తెలుగులో మాత్రమే విడుదల 
  • జేడీ పాత్ర కొత్తగా అనిపిస్తుంది 

కార్తికేయ హీరోగా రూపొందిన 'హిప్పీ' రేపు థియేటర్లకు రానుంది. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా దిగాంగన నటించగా, కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి కనిపించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ, "మనసుకి ఏది తోస్తే అది చేసే వ్యక్తిని 'హిప్పీ' అంటారు. అలాంటి పాత్రలోనే ఈ సినిమాలో కార్తికేయ కనిపిస్తాడు" అని అన్నారు.

 కార్తికేయ పాత్రతో పాటు జేడీ చక్రవర్తి పాత్ర ఈ సినిమాకి కీలకంగా నిలుస్తుంది. జేడీ పాత్రను కొత్తగా డిజైన్ చేశాము. ఆయన ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాడు .. కొత్తగా అనిపిస్తాడు. ఈ పాత్రకి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడతాయనడంలో సందేహం లేదు. తెలుగులో మాత్రమే ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తమిళ రీమేక్ గురించి ఇంకా ఆలోచించలేదు" అని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News