India: 2021 నాటికి అభివృద్ధిలో చైనాను వెనక్కి నెట్టేయనున్న భారత్!: ప్రపంచ బ్యాంకు

  • ఈ ఏడాది భారత వృద్ధిరేటు 7.5 శాతం
  • మరో రెండేళ్లు కొనసాగించనున్న భారత్
  • అదే సమయంలో తగ్గనున్న చైనా వృద్ధిరేటు

ఈ ఏడాది భారత ఆర్థికవృద్ధి రేటు 7.5 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. రాబోయే రెండేళ్లు అంటే 2019-20, 2020-21లో కూడా ఇదే వృద్ధిరేటు నమోదు అవుతుందని వెల్లడించింది. అదే సమయంలో చైనా వృద్ధిరేటు 2018లో 6.6 శాతంగా నమోదు కాగా, ఈ ఏడాది అది 6.2 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.

ఇది 2020లో 6.1 శాతానికి పరిమితమవుతుందని హెచ్చరించింది. అదే సమయంలో 2021 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థగా మారుతుందని చెప్పింది. 2021 నాటికి భారత వృద్ధిరేటు చైనా కంటే 1.5 శాతం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది.

More Telugu News