trivikram: మళ్లీ రంగంలోకి దిగిపోయిన త్రివిక్రమ్ - అల్లు అర్జున్

  • త్రివిక్రమ్ తో బన్నీ 3వ సినిమా
  • ఈ రోజు నుంచి సెకండ్ షెడ్యూల్ 
  • అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. తొలి షెడ్యూల్ పూర్తయిన తరువాత, ఎండలు విపరీతంగా ఉండటంతో బ్రేక్ ఇచ్చారు. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున హైదరాబాద్ లో మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను వదిలారు. ఈ షెడ్యూల్లో పూజా హెగ్డే జాయిన్ కానుంది. అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా. గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసినివారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇది 3వ సినిమా కావడం విశేషం. 

  • Loading...

More Telugu News