Undavalli: ప్రజావేదికను చంద్రబాబు నివాసంగా ఇవ్వమని కోరనున్న టీడీపీ

  • ఉండవల్లిలో బాబు నివాసానికి అనుబంధంగా ప్రజావేదిక
  • విపక్షనేతకు అధికారిక నివాసంగా ఇవ్వండి
  • ప్రభుత్వానికి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను ప్రతిపక్ష నేత అధికారిక నివాసంగా కేటాయించాలని తెలుగుదేశం పార్టీ కోరనుంది. నిన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఇంట్లో పార్టీ నాయకులు సమావేశమైన వేళ, పార్టీ నేతల సూచనతో ప్రజా వేదికను తమకు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. గుంటూరులో పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో లేదని భావించిన చంద్రబాబు, విజయవాడలో మరో మంచి భవంతిని ఎంపిక చేయాలని కేశినేని నాని, దేవినేని ఉమలను ఆదేశించారు. ఇక ప్రస్తుతం ఉన్న టీడీపీ జిల్లా కమిటీలను తొలగించి, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని కూడా టీడీపీ నేతల భేటీలో నిర్ణయించారు.
Undavalli
Jagan
Chandrababu
Praja Vedika

More Telugu News