fish medicine: శని, ఆదివారాల్లో చేప ప్రసాదం పంపిణీ.. 1.6 లక్షల చేప పిల్లలు సిద్ధం

  • మొత్తం 5 లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు
  • శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం
  • 32 కౌంటర్ల ఏర్పాటు

చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమవుతోంది. ఆస్తమా రోగుల కోసం ప్రతీ ఏడాది పంపిణీ చేసినట్టుగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

మొత్తం 32 కౌంటర్ల ద్వారా 5 లక్షల మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్టు హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పంపిణీ కొసాగుతుందని చెప్పారు. ప్రసాదం పంపిణీ కోసం 1.6 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News