vijay antony: అందువల్లనే ఈ నిర్ణయానికి వచ్చాను: విజయ్ ఆంటోని

  • విజయ్ ఆంటోని తాజా చిత్రంగా 'కిల్లర్'
  • విడుదల తేదీగా జూన్ 7 
  • తెలుగు .. తమిళ భాషల్లో విడుదల 

'బిచ్చగాడు' సినిమాతో తమిళ .. తెలుగు భాషల్లో విజయ్ ఆంటోని పాప్యులర్ అయ్యాడు. ఆ తరువాత తనే దర్శక నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే ఆ సినిమాలేవీ అంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'కిల్లర్' వస్తోంది. తమిళ .. తెలుగు భాషల్లో ఈ నెల 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. "నూతన దర్శకుడు ఆండ్ర్యూ లూయిస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ తో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా వుంది. నా సొంత సినిమాలు ఆడకపోవడం వలన బయట బ్యానర్లలో చేస్తున్నాను . ప్రస్తుతం నా చేతిలో పది సినిమాలు వున్నాయి. కొన్నాళ్లపాటు సంగీతాన్ని కూడా పక్కన పెట్టేసి, పూర్తిగా నటనపైనే దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను" అని ఆయన అన్నారు. 

More Telugu News