Police: ఒంటరి మహిళలను అంతమొందించే హంతకుడి అరెస్ట్!

  • ఐదుగురు మహిళల హత్య
  • ఇరుగు పొరుగువారి ఫిర్యాదుతో అరెస్ట్
  • మరికొన్ని హత్యలతో సంబంధముందని అనుమానం
అదిరిపోయే లేటెస్ట్ దుస్తులు ధరించి, మధ్యాహ్న సమయంలో ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లు ఎంచుకుని.. అతను దర్జాగా ఇంట్లోకి వెళతాడు. వెళ్లీవెళ్లగానే వెంటతెచ్చుకున్న సైకిల్ చైన్‌ను మహిళ మెడకు బిగించి, రాడ్‌తో కొట్టి చనిపోయిందని నిర్ధారించుకున్నాకే అక్కడి నుంచి పరారవుతాడు. ఇలా అతడు ఇప్పటికి ఐదుగురు మహిళలను హత్య చేసినట్టు పోలీసులు ధ్రువీకరించారు. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో పాత వస్తువులను అమ్మే వ్యాపారం చేసే కామరుజ్జమాన్ సర్కార్(41) అనే వ్యక్తి ఈ హత్యలను చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

అతని ఇరుగు పొరుగువారే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మాటు వేసి సర్కార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మధ్య వయసు మహిళలే లక్ష్యంగా అతను హత్యలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరికొన్ని హత్యలతో కూడా సర్కార్‌కు సంబంధముందని అనుమానిస్తున్నారు. అతను ఎందుకిలా మహిళలనే హత్య చేస్తున్నాడన్న విషయమై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Police
Cycle Chain
West Bengal
Kamarujjaman Sarkar

More Telugu News