Ramzan: కనిపించిన నెలవంక... గల్ఫ్ దేశాల్లో నేడు రంజాన్, ఇండియాలో రేపు!

  • సోమవారం రాత్రి కనిపించిన నెలవంక
  • ప్రకటించిన మక్కా మసీద్ ఇమామ్
  • ఇండియాలో దర్శనమివ్వని చంద్రుడు

గల్ఫ్‌ దేశాల్లో రంజాన్ పర్వదినాన్ని నేడు జరుపుకోనున్నారు. సోమవారం రాత్రి నెలవంక కనిపించిందని మక్కా మసీద్ ఇమామ్‌ వెల్లడించారు. సౌదీ అరేబియా సహా, యూఏఈ, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, ఇరాన్‌, ఇరాక్‌ తదితర దేశాల్లో మంగళవారం ఈద్‌-ఉల్-ఫితర్ జరుపుకోవాలని ఆయన సూచించారు. కాగా, గత రాత్రి ఇండియాలో మాత్రం నెలవంక కనిపించలేదు. నేడు కనిపిస్తే, రేపు రంజాన్ జరుగుతుంది. ప్రతియేటా గల్ఫ్‌ దేశాల్లో రంజాన్ జరిగిన మరుసటి రోజే ఇండియాలోని ముస్లింలు పండగను చేసుకుంటారు. కాగా, ఈ సంవత్సరం రంజాన్‌ ఉపవాస దీక్షలు 29 రోజులే కొనసాగడం గమనార్హం.

More Telugu News