Jagan: 23 మందిని కొన్నారు, సిగ్గులేకుండా వారిలో నలుగురికి మంత్రిపదవులిచ్చారు... ఇప్పుడేమైంది?: చంద్రబాబుపై జగన్ ధ్వజం

  • గుంటూరు ఇఫ్తార్ విందులో జగన్
  • దేవుడు రాసిన స్క్రిప్ట్ చాలా గొప్పగా ఉంది
  • ముగ్గురు ఎంపీలను లాక్కుంటే ఇప్పుడు దక్కింది ముగ్గురే
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ జగన్. గుంటూరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను దుర్మార్గంగా కొనడమే కాకుండా, సిగ్గు, శరం లేకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని మండిపడ్డారు. అయితే, ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంతో గొప్పదని, సరిగ్గా 23వ తారీఖునే ఫలితాలు రావడం, టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23 కావడం విచిత్రమని అన్నారు. అంతేకాకుండా, వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలను లాగేసుకున్నారని, ఆశ్చర్యకరంగా టీడీపీకి లభించిన ఎంపీలు కూడా ముగ్గురేనని తెలిపారు.
Jagan
Chandrababu
Guntur District

More Telugu News