Venkaiah Naidu: తిరుమల విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • స్వాగతం పలికిన జేఈవో
  • రేపు ఉదయం శ్రీవారి దర్శనం
  • రెండ్రోజుల పాటు తిరుమలలోనే వెంకయ్యనాయుడు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల విచ్చేశారు. స్వామివారి దర్శనం కోసం తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. రేపు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వెంకయ్యనాయుడు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. కాగా, వెంకయ్యనాయుడు రెండ్రోజుల పాటు తిరుమలలోనే బస చేయనున్నారు. ఈ మేరకు అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. కాగా, ఇవాళ వెంకయ్య తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Venkaiah Naidu
Tirumala
Tirupati

More Telugu News