mayavati: కూటమి కథ ముగిసినట్టే.. సంకేతాలిచ్చిన మాయావతి

  • యూపీలో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
  • ఒంటరిగానే పోటీ చేద్దామన్న మాయావతి
  • కూటమి వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్య

ప్రధాని మోదీకి చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ కూటమి కథ మూన్నాళ్లలోనే ముగిసిపోబోతోంది. 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని పార్టీకి సంబంధించిన ఓ సమావేశంలో మాయావతి ప్రకటించారు. దీంతో, సమాజ్ వాదీ పార్టీతో బీఎస్పీ అనుబంధానికి ముగింపు పడబోతోందనే విషయం స్పష్టమవుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కూటమి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాయావతి అన్నట్టు తెలుస్తోంది. యాదవుల ఓట్లు తమకు బదిలీ కాలేదని ఆమె అన్నారు. అఖిలేశ్ యాదవ్ కుటుంబం కూడా యాదవుల ఓట్లను గెలుచుకోలేకపోయిందని చెప్పారు. అందుకే ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పాటు అఖిలేశ్ యాదవ్ చిన్నాన్న శివపాల్ యాదవ్ యాదవుల ఓట్లను చీల్చారని మాయావతి భావిస్తున్నారు.

More Telugu News