psyco killer srinivasareddy: సైకో కిల్లర్‌ శ్రీనివాసరెడ్డి ఆ జంటనూ చంపేశాడా?

  • అవుననే చెబుతున్నారు గ్రామస్థులు
  • ఆరాతీస్తున్న పోలీసులు
  • మామిడి తోటలో పనికోసం వరంగల్‌ నుంచి వచ్చిన జంట
వరుస హత్యలతో భయోత్పాతం సృష్టించిన హాజీపూర్‌ సైకో కిల్లర్‌ శ్రీనివాసరెడ్డిని విచారిస్తున్న కొద్దీ పోలీసులకు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి చంపేసిన వారిలో వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ జంట కూడా ఉందని తాజాగా వెలుగు చూసింది. మామిడి తోటల్లో  పనికి కుదుర్చుతానని వరంగల్‌ జిల్లా నుంచి ఓ జంటను శ్రీనివాసరెడ్డి తీసుకువచ్చాడు. అయితే అది వీలుకాకపోవడంతో కొన్నాళ్లపాటు తనతోపాటు లిఫ్ట్‌ మెకానిక్‌ పనుల్లో వారి సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ జంట కనిపించకుండా పోయారని గ్రామస్థులు చెబుతున్నారు. శ్రీనివాసరెడ్డే వారిని చంపేసి మాయం చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి ఫోన్లో ఎక్కువగా అశ్లీల వెబ్‌సైట్‌ల కోసం వెతికినట్టు గుర్తించారు.
psyco killer srinivasareddy
Warangal Rural District
wife and husbend death

More Telugu News