siddaramaiah: భారత్ లో మేము కన్నడిగులం:సిద్ధరామయ్య

  • హిందీని బలవంతంగా రుద్దాలనుకోవద్దు
  • ఇది సామాజిక న్యాయాలకు విరుద్ధం
  • మా వరకు కన్నడ భాష ఒక గుర్తింపు

హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బోధించాలనే ప్రతిపాదనను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుబట్టారు. కొత్త భాషను నేర్చుకోవాలనేది వ్యక్తిగత నిర్ణయమని... ఎవరిపైనా దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయరాదని అన్నారు.

'మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన నేల. శాంతియుతంగా సామరస్యాన్ని కొనసాగించాలి. బలవంతంగా ఏదైనా రుద్దాలనుకోవడం సామాజిక న్యాయాలకు విరుద్ధం. మా వరకు కన్నడ భాష అనేది ఒక గుర్తింపు. వేరే భాష నేర్చుకోవాలా? వద్దా? అనేది ఒక ఛాయిస్ మాదిరే ఉండాలి' అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.

ఇతర భాషను బలవంతంగా రుద్దాలనుకోవడం ప్రాంతీయ గుర్తింపును కాలరాయడమే అవుతుందని అన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో కూడా హిందీని రుద్దాలనుకోవడం తమ సెంటిమెంట్లను దెబ్బతీయడమేనని సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్రాల ప్రాంతీయతకు గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు. భారత్ లో తాము కన్నడిగులమని చెప్పారు.

More Telugu News