Narendra Modi: ప్రధాని మోదీని చంపేస్తామంటూ రాజస్థాన్ బీజేపీ చీఫ్‌కు అందిన బెదిరింపు లేఖ ఫేక్: తేల్చిన పోలీసులు

  • ప్రమాణ స్వీకారానికి ముందే మోదీని కాల్చి చంపుతామంటూ లేఖ
  • ఆకతాయి పని అని తేల్చిన పోలీసులు
  • గతంలోనూ మోదీని చంపేస్తామంటూ లేఖలు
ప్రమాణ స్వీకారానికి ముందే మోదీని చంపేస్తామంటూ రాజస్థాన్ బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీకి అందిన లేఖ ఒట్టిదేనని, ఎవరో ఆకతాయి చేసిన అల్లరి పని అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గత నెల 30న ప్రమాణ స్వీకారానికి ముందే మోదీని కాల్చి చంపబోతున్నట్టు తనకు లేఖ అందిందని, వెంటనే దానిని పోలీసులకు అందించినట్టు మదన్ లాల్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ లేఖను ఎవరో ఆకతాయి రాసినట్టు తేల్చారు. ఆ లేఖను తీవ్రంగా పరిగణించాల్సిన పనిలేదని పేర్కొన్నారు.

మరోపక్క, ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్‌కు చెందిన నవీన్ యాదవ్ తనకు డబ్బులిస్తే మోదీని చంపేస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తాను సరదా కోసమే అలా పోస్టు చేశానంటూ తర్వాత అతడు క్షమాపణలు చెప్పాడు. ప్రధాని మోదీని రాజీవ్ గాంధీ తరహాలో చంపేస్తామంటూ నక్సల్స్ రాసినట్టుగా పేర్కొన్న ఓ లేఖను గతేడాది మహారాష్ట్ర పోలీసులు విడుదల చేశారు.
Narendra Modi
Kill
Madan Lal Saini
BJP
Rajasthan

More Telugu News