Ration: కేంద్ర గోదాముల్లో భారీ నిల్వలు... రేషన్ కోటాను పెంచనున్న కేంద్రం!

  • ప్రస్తుతం నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు
  • 7 కిలోలకు పెంచనున్న మోదీ సర్కారు
  • అతిత్వరలోనే ఉత్తర్వులు

దేశంలోని 81 కోట్ల మందికి అదనపు రేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ కార్డుదారులకు నెల నెలా ఇచ్చే రేషన్ ను పెంచనున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలను అందిస్తుండగా, దీన్ని 7 కిలోలకు పెంచే దిశగా అతి త్వరలోనే కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇండియాలో 2.40 కోట్లకు పైగా అంత్యోదయ రేషన్ కార్డులుండగా, వీరికి పంచదార, బియ్యం, గోధుమలు తదితరాలను పౌర సరఫరాల శాఖ ద్వారా సబ్సిడీపై అందిస్తున్నారు.

ఇక, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో నిల్వలు పెరగడంతోనే రేషన్ కోటా పెంచాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్సీఐ వద్ద 29 కోట్ల టన్నుల గోధుమలు, 41 కోట్ల టన్నుల బియ్యం ఉన్నాయి. ఇవి 80 మిలియన్ టన్నుల వరకూ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News