Metro Train: దేశ రాజధానిలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఢిల్లీ ప్రభుత్వం కసరత్తు

  • మెట్రో రైల్ అధికారులతో కైలాష్ గహ్లోత్ సమావేశం
  • సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వెల్లడి
  • రేపు నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఓ కానుకను ఇవ్వనుంది. దేశ రాజధానిలో మహిళలకు ఉచితంగా మెట్రో రైలు, బస్సు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులతో ఆ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి కైలాష్ గహ్లోత్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఢిల్లీ మెట్రోపై తమకు పూర్తి అధికారం అప్పగిస్తే ఛార్జీలను 25 నుంచి 30 శాతం తగ్గిస్తామని ప్రకటించారు. అయితే మహిళల ఉచిత ప్రయాణం విషయంపై రేపు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

More Telugu News